టీలలో చీజ్ చాయ్ రుచి వేరయా.. !

టీలలో చీజ్ చాయ్ రుచి వేరయా.. !

ప్రస్తుత రోజుల్లో వింత వింత ఐటెమ్స్ తో రకరకాలు రెసిపీలు వస్తున్నాయి. కొన్నింటిని చూస్తే వావ్.. అనాలనిపిస్తుంది. మరికొన్నింటిని చూస్తే ఏంటీ.. అసలు దీన్ని కూడా తింటారా అనే ఫీలింగ్ వస్తుంది. అయితే ఇలాంటి వెరైటీ కాంబినేషన్లో వచ్చిందే చీజ్ టీ. అల్లం టీ, లెమన్ టీ, బ్లాక్ పెప్పర్ టీ.. ఇప్పటివరకూ చాలా రకాల తేనీటి విందును ఆస్వాదించి ఉంటాం. కానీ ఈ చీజ్ టీ ఏంటీ.. అనుకుంటున్నారా.. అదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి కారణం ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోనే.

చీజ్ చాయ్ వాలీ అనే పేరుతో షేర్ చేసిన ఈ వీడియోలో నోరూరించే టీ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. అయితే తనతో పాటు.. టీ ప్రియలందరికీ అని మెన్షన్ చేస్తూ.. ఇండియాలో ఒక చోట ఈ చీజ్ టీని అమ్ముతున్నారని ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోకు ఇప్పటికే వేలల్లో వ్యూస్, వందల్లో లైక్స్ వచ్చాయి. అయితే ఈ వీడియోను చూసిన పలువురు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. దీన్ని చూస్తే వాంతులు వచ్చేలా ఉందని ఒకరంటే.. ఈ గ్రహం నుంచి వెళ్లిపోయే టైం వచ్చిందని మరొకరు స్పందించారు. ఇంకొకరేమో అసలిది చీజ్ టీనే కాదని, ఇది చీజ్ ఆనియన్ సూప్ అని కామెంట్స్ ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.