వీడియో: క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి కోడి.. ఏం చేసిందో చూడండి

వీడియో: క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి కోడి.. ఏం చేసిందో చూడండి

ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫేమస్సేమో కానీ, మనదేశంలో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. అందుకే క్రికెట్ మైదానంలో చోటుచేసుకునే ఏ చిన్న సంఘటన అయినా.. క్షణాల్లోనే సోషల్ మీడియాలో వాలిపోతుంది. 

ఇదలా ఉంచితే అప్పుడప్పుడు క్రికెట్ స్టేడియంలో కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మ్యాచ్ మధ్యలో పాములు రావడం, మైదానంలో పక్షులు వాలడం లేదంటే తమ అభిమాన క్రికెటర్ కోసం ఫ్యాన్స్ పరిగెత్తుకు రావడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు ఇఫ్పటి వరకు బోలెడన్నీ చూసే ఉంటాం. కానీ, క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి కోడి ఎంటరవ్వడం ఎప్పుడైనా చూశారా? చూసుండరు. ఇప్పుడు అది కూడా జరిగిపోయింది. 

ఉన్నట్టుండి ఓ కోడి క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యక్షమయ్యింది. చుట్టూ ఆటగాళ్లు ఉన్నా.. అది ఏమాత్రం భయపడలేదు. వారి మధ్యనే ఉంటూ కాసేపు అక్కడే కలియతిరిగింది. ఆ దృశ్యాలను ఓ క్రికెటర్ తన సెల్‌ఫోన్‌లో బంధించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారత్-వెస్టిండీస్‌ జట్ల మధ్య మూడో టీ20 జరిగిన గయానా స్టేడియంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇది జరిగిందని సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోపై నెటిజెన్స్ చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో క్రికెటర్లు ఏం చేస్తారని తెలుసుకోవడానికి అక్కడకి వచ్చి ఉండొచ్చని ఓ నెటిజెన్ అభిప్రాయపడ్డారు.