డబ్ల్యూహెచ్‌‌వో డేటా.. కాంగ్రెస్‌‌ బేటా రెండూ తప్పే

డబ్ల్యూహెచ్‌‌వో డేటా.. కాంగ్రెస్‌‌ బేటా రెండూ తప్పే

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మరణాలపై కాంగ్రెస్‌‌ ఎంపీ రాహుల్‌‌ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. డబ్ల్యూహెచ్‌‌వో డేటా, కాంగ్రెస్‌‌ బేటా ఈ రెండే తప్పేనని విమర్శించింది. శుక్రవారం బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌‌ పాత్ర మాట్లాడుతూ, దేశంలో కరోనా మరణాలను లెక్కించడానికి డబ్ల్యూహెచ్‌‌వో పద్ధతి లోపభూయిష్టంగా, ఉహాత్మకంగా ఉందని ఆరోపించారు. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టను తగ్గించడానికి రాహుల్‌‌ గాంధీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ ప్రయత్నంలో ఆయన దేశ ప్రతిష్టను తగ్గించారని అన్నారు. మన రిజిస్ట్రార్‌‌‌‌ జనరల్‌‌ ఆఫ్‌‌ ఇండియా దగ్గర దేశంలో జనన, మరణాలను లెక్కించడానికి బలమైన యంత్రాంగం ఉందని సంబిత్​ పాత్ర చెప్పారు.