
న్యూఢిల్లీ: ఓట్ల కంటే ప్రజల మనసులు చూరగొనడమే బీజేపీ ధ్యేయమని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీని ఎన్నికలు గెలిచే యంత్రంగా వస్తున్న కామెంట్లపై ఆయన ఫైర్ అయ్యారు. పార్టీ 41వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మోడీ మాట్లాడారు. 'ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మమ్మల్ని ఎలక్షన్ విన్నింగ్ మెషీన్ అని పిలుస్తున్నారు. కానీ మిగతావారు గెలిచినప్పుడు ఆయా పార్టీలు తమను తాము పొగుడుకుంటున్నాయి. మమ్మల్ని విమర్శించే వారికి ఓటర్లను అంచనా వేయడం తెలియదనే చెప్పాలి. వాళ్లు ఎప్పటికీ ఓటర్ల కలలు, ఆశయాలను అర్థం చేసుకోలేరు' అని మోడీ స్పష్టం చేశారు.