యశోదలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ మృతి

యశోదలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ మృతి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బీజేపీ కార్యకర్త గంగుల శ్రీనివాస్‌ మృతి చెందారు. నవంబర్‌ 1న బీజేపీ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 44 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరగా.. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి  చనిపోయాడు శ్రీనివాస్.