కడం,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం కడెం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్ లో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ సమావేశం సందర్భంగా నియోజకవర్గంలోని మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలతో పాటు సుమారు 300మంది బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అలెగ్జాండర్, మండలాధ్యక్షుడు తుమ్మల మల్లేశ్, దయానంద్, జిల్లా యూత్ అధ్యక్షుడు సతీశ్ రెడ్డి, వాజిద్ ఖాన్, బూషన్ పాల్గొన్నారు.