రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

14మంది రాజ్యసభఅభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. నామినేషన్ల గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఉత్తరాఖండ్,  ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, బీహార్, ఛత్తీస్‌గఢ్,  వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుంచి ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం తమ రాజ్యసభ అభ్యర్థుల జామితాను బీజేపీ  విడుదల చేసింది.  ఇందులో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఏడుగురు అభ్యర్థులు.. ఆర్ పీఎస్ సింగ్, డా.సుధాన్షు త్రివేది, చౌదరి తేజ్ వీర్ సింగ్, సాధనా సింగ్, అమర్ పాల్ మౌర్య, సంగీత బల్వంత్, నవీన్ జైన్ ఉన్నారు. బీహార్ నుంచి  ఇద్దరు అభ్యర్థులు.. డా ధర్మశీల గుప్తా, భీమ్ సింగ్ లు, ఉత్తరాఖండ్ నుంచి మమేంద్ర భట్, చత్తీస్ గఢ్ నుంచి రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్, పశ్చిమ్ బెంగాల్ నుంచి సమిక్ భట్టాచార్య, కర్ణాటక నుంచి నారాయణ క్రిష్‌నాసా ఉన్నారు.

ఫిబ్రవరి 8న  రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల15 వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఎలక్షన్ కమిషన్ గడువు ఇచ్చింది. ఇక,16న నామినేషన్ల పరిశీలన, 20న విత్ డ్రాకు అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి.