రాజ్యసభకు జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ భార్య

రాజ్యసభకు జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ భార్య

ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ భార్య సాగరిక ఘోష్ కు పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆమెను రాజ్యసభకు నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రానున్న రాజ్యసభ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసి) పార్టీ.. ఆదివారం తమ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది.  సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ భార్య సాగరిక ఘోష్ తోపాటు సుస్మితా దేవ్, ఎండీ నడిముల్ హక్, మమతా బాలా ఠాకూర్‌లను రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడానికి పార్టీ ఎంపిక చేసింది.

దీంతో సాగరికా ఘోష్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో మారుమోగుతూ ట్రెండింగ్ ఉంది. ఆమె కూడా జర్నలిస్టుగా చాలా సంవత్సరాలు పనిచేశారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఔట్‌లుక్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పెద్ద పెద్ద వార్తా సంస్థల్లో ఘోష్  పనిచేయడమే కాదు..ప్రధాని మోదీపై,  ప్రభుత్వ  విధానాలపై తీవ్రమైన విమర్శలు చేస్తుంటారు.