లోక్‌‌సభలో బీజేపీ విప్‌‌గా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

లోక్‌‌సభలో బీజేపీ విప్‌‌గా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: లోక్‌‌సభలో బీజేపీ విప్‌‌గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు సోమవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ సెక్రటరీ శివ్‌‌ శక్తినాథ్ బక్షీ స్పీకర్‌‌‌‌కు పేర్లను సమర్పించారు. చీఫ్ విప్‌‌తో పాటు 16 మంది విప్‌‌ల పేర్లను బక్షీ లేఖలో పేర్కొన్నారు. ఇందులో చీఫ్ విప్‌‌గా సంజయ్ జైశ్వాల్‌‌ను అధిష్టానం నియమించింది. 

విప్‌‌గా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు దిలీప్ సైకై, గోపాల్ జీ ఠాకూర్, సంతోష్ పాండే, కమల్ జీత్ సెహర్వాత్, డి.లక్ష్మణ్ భాయ్ పాటిల్, చౌహాన్, జుగల్ కిషోర్ శర్మ, కోట శ్రీనివాస్ పూజారి, సుధీర్ గుప్తా, స్మితా ఉదయ్, అనంత్ నాయక్, దామోదర్ అగర్వాల్, సతీశ్‌‌ కుమార్ గౌతమ్, శశాంక్ మణి, ఖేగెన్ ముర్మును నియమిస్తూ స్పీకర్‌‌‌‌కు వారి పేర్లను పంపారు.