
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ ఎంపీ ఓ యువతికి ముద్దుపెట్టడం వివాదాస్పదంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బెంగాల్ లోఎని నార్త్ మాల్దా లోక్ సభకు బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్మూ పోటీచేస్తున్నారు. ఏప్రిల్ 8 ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని శ్రిహిపూర్ గ్రామంలో ప్రచారానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువతి చెంపపై ముద్దు పెట్టారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది.
దీనిపై ట్విట్టర్లో స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బెంగాలీ మహిళలపై వేధింపులు ఆపాలని సూచించింది. బీజేపీ అభ్యర్థులు చేష్టలు ప్రచారంలోనే ఇలా ఉంటే..అధికారంలోకి వస్తే ఇంకా ఎలా ఉంటాయో ఆలోచించుకోవాలని విమర్శలు చేసింది.
అయితే ఈ ముద్దు ఘటనపై స్పందించిన ఎంపీ ఖగేన్ ముర్మూ ఆ యువతి తనకు కూతురు లాంటిది..కూతురికి ముద్దుపెడితే తప్పేంటి.? కుట్రపూరితంగా వివాదం చేస్తున్నారు. టీఎంసీపై ఫిర్యాదు చేస్తానని అన్నారు. అలాగే యువతి కూడా బీజేపీ ఎంపీకి మద్దతిచ్చింది. ఆయన తన కూతురిలా ముద్దుపెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించింది.ఆ ఫోటో తీసేటప్పుడు తన అమ్మానాన్న కూడా ఉన్నారని అన్నారు.