
రాష్ట్రంలో జాబ్స్ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. చాలా ఏళ్లుగా అప్పులు తెచ్చి చదువుకుంటున్నామని యువకులు కన్నీరు పెట్టుకున్నారన్నారు. సీఎం ఇంట్లో ఐదు ఉద్యోగాలున్నాయని.. వారికి నెలకు 16 లక్షల జీతం వస్తోందన్నారు. మరి రాష్ట్రంలోని యువకుల సంగతేంటని ప్రశ్నించారు సంజయ్. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ఈనెల 16 న మిలియన్ మార్చ్ చేపడతామని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నారు.