గౌరవ్ యాత్రను ప్రారంభించిన నడ్డా

గౌరవ్ యాత్రను ప్రారంభించిన నడ్డా

గౌరవ్ యాత్ర ఒక్క గుజరాత్ కే కాకుండా యావత్ భారత దేశానికి గర్వంచదగ్గ యాత్రని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. గుజరాత్ లో గౌరవ్ యాత్రను నడ్డా  ప్రారంభించారు. ఐదు వేర్వేరు రూట్లలో గౌరవ్ యాత్ర చేయనున్నారు. ఇవాళ నడ్డా ద్వారక ఆలయం నుంచి గౌరవ్ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో కేంద్రం మంత్రి భూపేందర్ యాదవ్ తో పాటు, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ లు పాల్గోనున్నారు. గుజరాత్‌లోని  టెంపుల్ టౌన్ నుంచి ప్రారంభమైన  ఈ యాత్ర అక్టోబర్ 20న కచ్‌లోని మాండ్విలో ముగుస్తుంది

అయితే ఇతర ప్రాంతాల్లో రేపు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా గౌరవ్ యాత్రను ప్రారంభిస్తారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బీజేపీ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు గుజరాత్ గౌరవ్ యాత్రను చేపట్టింది.  గుజరాత్ గౌరవ్ యాత్రలో ప్రతి ఒక్కరు గర్వంగా పాల్గొనలని నడ్డా తెలిపారు. ఇన్నేళ్ల పాలనలో కాంగెస్ చేసిందేం లేదని విమర్శించిన ఆయన దేశాన్ని ప్రధాని మోడీ ఆధునీకరించారన్నారు.