
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించాయని, దీంతో తాను కోవిడ్-19 పరీక్షలు చేయించుకోగా రిపోర్టులో తనకు పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సలహా మేరకు హోంఐసోలేషన్లో ఉన్నట్లు జేపీ నడ్డా పేర్కొన్నారు. “కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నా. రిపోర్టులో కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కోవిడ్ గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నా. ఇటీవల నన్ను కలిసి వారంతా హోమ్ ఐసోలేషన్‌లోనే ఉండండి. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోండి” అని తన ట్వీట్ లో పేర్కొన్నారు