రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోంది: తమ్మినేని వీరభద్రం

 రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోంది: తమ్మినేని వీరభద్రం

ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. కేసులు నిరూపణ కాకముందే సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీని కేంద్రం టార్గెట్ చేసి ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని అన్నారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల కోసం బీజేపీ ప్రత్యేకంగా కమిటీ వేయడం దుర్మార్గమని అన్నారు. మాజీ సీఎం రాజశేఖర రెడ్డి పేరుతో ఆయన కుమార్తె షర్మిల పార్టీ పెట్టి తెలంగాణలో హడావుడి చేస్తోందని ప్రస్తావిస్తూ.. షర్మిల ముమ్మాటికి బీజేపీ వదిలిన బాణమే అన్నారు. షర్మిల చేస్తున్న పాదయాత్ర సమస్యల పరిష్కారం కోసం కాదని..  షర్మిల ప్రతిరోజూ చేస్తున్న విమర్శలు, వాడుతున్న భాష బీజేపీ కోసమేనని ఇప్పటికే  స్పష్టమయిందని తమ్మినేని వీరభద్రం తెలిపారు.