బీజేపీ కోర్ కమిటీ భేటీ.. ముందస్తు ఎన్నికలపై చర్చ

బీజేపీ కోర్ కమిటీ భేటీ.. ముందస్తు ఎన్నికలపై చర్చ

అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కోర్ కమిటీ భేటీ కొనసాగుతోంది.  మధ్యాహ్నం రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగనుంది. కోర్ కమిటీ మీటింగ్ కు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ తో పాటు కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, విజయశాంతి, మురళీధర్ రావు తదితర నేతలు హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కార్యాచరణపై డిస్కస్ చేయనున్నారు.

సీఎం కేసీఆర్ ముందస్తుకువెళితే, అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. అలాగే ప్రజా సంగ్రామ యాత్ర, ప్రజా గోస.. బీజేపీ భరోసా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. త్వరలో హైదరాబాద్ లో జరిపే బండి సంజయ్ పాదయాత్ర రూట్ మ్యాట్ ను కోర్ కమిటీ రూపొందించనుంది. మరోవైపు పదాధికారుల సమావేశానికి తరుణ్ చుగ్, సంజయ్ తో పాటు... రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించి పదాధికారులు హాజరవ్వనున్నారు. సర్కార్ వైఫల్యాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.