‘మోస్ట్ బ్యాక్ వర్డ్‘ పైనే బీజేపీ ఆశలు

‘మోస్ట్ బ్యాక్ వర్డ్‘ పైనే బీజేపీ ఆశలు

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మెజారిటీ లోక్ సభ సీట్లు గెలుచుకోవడానికి ఈసారి బీజేపీ పక్కా ప్లాన్ రెడీ చేసింది. బీసీల్లో నే అత్యంత వెనుకబడిన కులాల (మోస్ట్ బ్యా క్ వర్డ్ కేస్ట్)పై ఆశలు పెట్టు కుంది. సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయలోక్ దళ్ (ఆర్ఎల్డీ)లు ఓ కూటమిగా రంగంలోకి దిగడంతో ‘మోస్ట్ బ్యాక్ వర్డ్కేస్ట్’ ఆయుధాన్ని కాషాయదళం ప్రయోగిస్తోంది.2014 లోక్‌‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 80 నియోజకవర్గాల్లో బీజేపీ 71 సెగ్మెంట్లు గెలుచుకుందంటే దానికి ప్రధాన కారణం ఓబీసీలు మద్దతు ఇవ్వడమే. అంతేకాదు, 2009 ఎన్నికలతో పోలిస్తే 2014లోబీజేపీ ఓటు షేర్ 31 శాతం పెరిగింది. ఈసారి ఓబీసీలంతా తమ వైపే ఉన్నారని కూటమి నేతలు అఖిలేశ్ యాదవ్, మాయావతి భావిస్తున్నా రు. దీంతో ఓబీసీల్లో నే అత్యంత వెనకబడ్డ కులాలకు బీజేపీ గేలం వేస్తోంది.రాష్ట్రం లోని 80 లోక్‌‌సభ స్థా నాలకుగాను మొత్తంఏడు విడతల్లో నూ సగటున 11 స్థా నాలకు పోలింగ్‌‌ జరగనుంది. తొలి విడతలో 8 సీట్లకు ఈ నెల 11నఎన్నికలు జరుగుతాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గల మోస్ట్‌‌ బ్యాక్‌‌వర్డ్‌‌ కులాలపై బీజేపీ దృష్టి పెట్టిం ది. వీరిఓట్లు ఒక్కో నియోజకవర్గం లో సుమారుగా మూడులక్షల వరకు ఉంటుందని అంచనా.

అత్యంత వెనుకబడిన 70 బీసీ కులాలు

యూపీలో ఒకప్పుడు వెనుకబడిన కులాలన్నిటినీ ఒకే గాటన కట్టేసేవారు. తర్వాత బీసీ కులాలనుకూడా వారి ఆర్థిక, సామాజిక స్థా యిని బట్టి  డివైడ్చేశారు. ‘బ్యాక్ వర్డ్’, ‘మోర్ బ్యాక్ వర్డ్’, ‘మోస్ట్ బ్యాక్ వర్డ్ ’ కులాలుగా బీసీలను విభజించారు. ఈ విభజన తర్వాత సమాజంలోని అనేక సోష ల్ గ్రూప్‌‌లలోఅత్యంత వెనుకబడిన కులాలు తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాయి.

2001లో బీసీల విభజన

2001లో యూపీ ముఖ్యమంత్రిగా రాజ్‌‌నాథ్ ఉన్నసమయంలో వెనుకబడిన తరగతుల గురించి స్టడీచేసి, అవసరమైతే క్లాసిఫికేషన్ చేయడానికి బీజేపీమంత్రి హుకుం సింగ్ నాయకత్వాన ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి వాటాను బట్టి బీసీ కులాలను ‘బ్యాక్ వర్డ్’, ‘మోర్ బ్యాక్ వర్డ్’,‘మోస్ట్ బ్యా క్ వర్డ్’ కులాలుగా హుకుం సింగ్ కమిటీడివైడ్ చేసింది. ఈ విభజన తర్వాత ‘బ్యా క్ వర్డ్’లిస్ టులో ఒకే ఒక్క కులం ‘యాదవ’ వచ్చింది. జాట్,కుర్మీ, లోథ్, సోనార్ సహా మొత్తం ఎనిమిది కులాలను‘మోర్ బ్యా క్ వర్డ్’ కులాలుగా డివైడ్ చేశారు. ఈ రెండుజాబితాలు కాకుండా మూడో జాబితాకూడా ఏర్పాటు చేశారు. అదే ‘మోస్ట్ బ్యా క్ వర్డ్’ బీసీలు. ఈ కేటగిరీలో మొత్తం 70 కులాలున్నాయి. 2002 మార్చిలో రాజ్‌‌నాథ్ సింగ్ సీఎం కుర్చీ నుంచి దిగిపోవడంతో హుకుం సింగ్ కమిటీ నివేదిక అమలుకు నోచుకోలేదు. అయినప్పటి కీ యాదవులు, కుర్మీలను ఒకే గాటనకట్టివేయకుండా తమ నెనుకబాటుతనాన్ని గుర్తించినందుకు మోస్ట్‌‌ బ్యాక్‌‌వర్డ్‌‌ కులాలు చాలా హ్యా పీగా ఫీలయ్యా యి. బీసీ కులాలను వారి సామాజిక స్థాయినిబట్టి మూడు కేటగిరీలుగా విభజించినప్పటి నుంచి అప్పటి వరకు మెజారిటీ బీసీ కులాలకు నాయకత్వంవహిస్తున్న యాదవుల ఆధిపత్యా నికి గండిపడినట్లయింది.

మోర్బ్యాక్వర్డ్బీజేపీ వెంటే

దీనికి తోడు ‘మోర్ బ్యా క్ వర్డ్’ జాబితాలో ఉన్న లోధీలుమొదటి నుంచి బీజేపీ వెంటే ఉన్నా రు. వీరిలో ప్రముఖులు కల్యా ణ్‌ సింగ్‌‌, సాధ్వీ ఉమాభారతి వంటి వారుఉన్నారు. బీసీల్లో ఉన్న జాట్లు, కుర్మీలు, యాదవులు భూమిపై అధికారం ఉన్న కులాలు. ఈ మూడు కులాల ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా పార్టీలు కూడా ఉన్నాయంటున్నా రు రాజకీయ పండితులు. జాట్లకోసం అజిత్ సింగ్ నాయకత్వం లో రాష్ట్రీయ లోక్దళ్, యాదవుల కోసం అఖిలేశ్ ఆధ్వర్యంలో సమాజ్ వాది పార్టీ ఉన్నా యి. అప్నాదళ్ పార్టీకి కుర్మీల పార్టీగా పేరుంది. ఈ పార్టీకి ఇద్దరు ఎంపీలుండగా,వారిలో మీర్జా పూర్‌‌ నుంచి గెలిచిన అనుప్రియ పటేల్‌‌ సింగ్‌‌ ప్రస్తుతం మోడీ కేబినెట్‌ లో సహాయ మంత్రిగాఉన్నారు. ఒక్క యాదవులు మినహా మిగతా రెండుకులాలవారు బీజేపీ వెనుకే ఉంటారన్న ధీమా ఉంది..అంతేకాకుండా, మోస్ట్‌‌ బ్యాక్‌‌వర్డ్‌‌ క్లాస్‌‌కి చెందిన 17కులాలను ఎస్‌‌సీ కేటగిరీలో చేరుస్తామని గతంలోబీజేపీ ప్రకటించింది. వీరిలో రాజ్‌‌భర్‌‌, నిషాద్‌ , ప్రజాపతి, మల్లా, కహర్‌‌, కాశ్యప్‌‌, కుంభార్‌‌, ధిమార్‌‌,బింద్‌ , భర్‌‌, కేవత్‌‌, ధివర్‌‌, బత్తమ్‌ , మచువా, మాంఝీ,తుర్హా , గౌర్‌‌ కులాలున్నాయి.మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముస్లిం లనుకూడా వారి వృత్తులను బట్టి, వారి సామాజిక స్థా యిని బట్టి ఓబీసీలుగా విభజించా రు. ఏమైనా యూపీలోప్రస్తుతం అత్యంత వెనుకబడిన చిన్న కులాలేరాజకీయ పార్టీల తలరాతలు మార్చబోతున్నా యి. ఈకులాల అండతో బీజేపీ గట్టెక్కుతుందా, లేదా అనేదివేచి చూడాల్సిందే.యూపీలో కులాల లెక్కలు

యూపీలో కులాల లెక్కలు

కులం                                                   జనాభాలో శాతం

హిందూ ఓబీసీ                                          41.47

షెడ్యూల్డ్ కులాలు                                       21.1

పెద్ద కులాలు, ఇతరులు                               18.92

ముస్లిం ఓబీసీ                                            12.58

ముస్లిం జనరల్ కేటగిరీ                                 5.73

షెడ్యూల్డ్ తెగలు                                          0.1

క్రిస్టియన్స్                                                 0.1

 నెంబర్ గేమ్ షురూ

అత్యంత వెనుకబడిన కులాల పేరిట 70 చిన్న కులాలకు ప్రత్యే క గుర్తింపు రావడంతో యూపీ పాలిటి -క్స్‌‌లో నెంబర్ గేమ్ మొదలైంది. బీజేపీకి సంప్రదాయంగా జనాభాలో 19 శాతం ఉన్న పెద్ద కులాలమద్దతు ఉంది. ఈ పెద్ద కులాలకు మోస్ట్ బ్యా క్ వర్డ్ కులాలు కూడా తోడు అయితే సమాజ్‌‌వాది పార్టీనాయకత్వంలోని కూటమిని ఎదుర్కోవడం ఈజీ అని బీజేపీ డిసైడ్ అయింది. ఈ 70 చిన్న కులాలనుతమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా డైరక్షన్‌ లో ఆ పార్టీకి చెందిన లీడర్లు ప్లాన్ ప్రకారం ముందుకెళుతున్నారు.