- బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు
ఖమం టౌన్, వెలుగు : అధికార కాంగ్రెస్ వైఫల్యాలే మన అస్త్రాలని, ఖమ్మం కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్పొరేషన్ ముఖ్య నాయకుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, రాష్ట్ర నాయకుడు, నల్గొండ జిల్లా ఇన్చార్జ్ సన్నీ ఉదయ ప్రతాప్ తో కలిసి ఆయన మాట్లాడారు.
రానున్న ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కాషాయ జెండాను రెపరెపలాడించడమే ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, నాయకులు మందడపు సుబ్బారావు, దుద్దుకూరి వెంకటేశ్వరరావు, గంట్యాల విద్యాసాగర్, ఒక్క లంక సుబ్రహ్మణ్యం, సుదర్శన్ మిశ్రా, వీరల్లి రాజేశ్ గుప్త, రజినీ రెడ్డి,అనిత, జ్వాల నరసింహారావు, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
