
రెబల్ ఎంపీ శతృఘ్న సిన్హాకు.. అనుకున్నట్లే బీజేపీ షాక్ ఇచ్చింది. పాలక పక్షంలోనే ఉంటూ… ప్రధాని మోడీ తీరును పదేపదే విమర్శిస్తున్న ఆ పార్టీ ఎంపీ శతృఘ్న సిన్హాకు.. ఈ సారి లోకసభ టికెట్ దక్కలేదు. పాట్నా సాహిద్ స్థానం నుంచి పోటీ చేసే శతృఘ్నసిన్హా స్థానాన్ని ఈసారి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేటాయించారు. శతృఘ్న సిన్హాకు ఈసారి టికెట్ దక్కే అవకాశాలు లేవని ముందు నుంచే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టికెట్ రాకపోవడంతో శతృఘ్న సిన్హా.. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. సిన్హా కాంగ్రెస్ లో చేరుతారనే రూమర్లు వినిపిస్తున్నాయి. బీహార్‌లోని 40 స్థానాలకు చెందిన లిస్టును ఇవాళ(శనివారం) ఎన్డీఏ కూటమి రిలీజ్ చేసింది.