
- సీపీఐఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు
గోదావరిఖని, వెలుగు: దేశంలో ఎన్నికల కమిషన్పూర్తిగా వైఫల్యం చెందిందని, అది బీజేపీ జేబు సంస్థగా మారిందని సీపీఐ ఎంఎల్మాస్లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. దేశంలో ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, ప్రజాస్వామ్యం కూడా ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బిహార్ లో 60 లక్షల ఓట్లను తొలగించి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల కమిషన్వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టులాంటిదని విమర్శించారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్లు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను కేంద్రం సరఫరా చేయాలని, సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మీటింగ్‌లో లీడర్లు కట్ట రమ, నంది రామయ్య, జూపాక శ్రీనివాస్, తోకల రమేశ్, జాడి దేవరాజ్, జిందం రాంప్రసాద్, గుమ్మడి వెంకన్న, పెండ్యాల రమేశ్పాల్గొన్నారు.