మిషన్ 2024.. బీజేపీకి అసలు సవాళ్లు

మిషన్ 2024.. బీజేపీకి అసలు సవాళ్లు

పెండింగ్, సవాలుగా మారిన అంశాలపైనా బీజేపీ ఫోకస్ పెట్టింది. ఉద్యోగాల కల్పనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీల భర్తీని మొదలుపెట్టింది. కొన్నినెలలుగా నెలకు 70 వేలకు పైగా రిక్రూట్ మెంట్లు చేస్తూ అపాయింట్ మెంట్ లెటర్లు అంది స్తున్నారు. ఏడాదిలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యో గాలు భర్తీ చేస్తామని కేంద్రం ప్రకటించింది. ప్రైవేటు రంగంలోనూ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం (పీఎల్ఐ) వల్ల దేశీయంగా అవకాశాలు పెరిగాయని చెప్తోంది. 

ఇక పేద, మధ్యతరగతి వర్గాలకు భారంగా మారిన నిత్యా వసరాల రేట్లు త్వరలోనే అదుపులోకి వస్తాయని అంటోంది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నాటికి రేట్లు చాలా వరకు కంట్రోల్ అవుతాయని అధికారులు చెబుతున్నారు. పెట్రో రేట్లను కూడా తగ్గించనున్నట్లు కేంద్రం సంకేతాలిచ్చింది. ఇక వివాదంగా మారిన అంశాలపై మాత్రం మోదీ సర్కారు ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకే సివిల్ కోడ్ బిల్లు ఈ సెషన్ లోనే పార్లమెంట్ ముందుకు వస్తుందని ప్రచారం జరిగినా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దానిని వాయిదా వేసింది.