వరంగల్ లో ఈ27న బీజేపీ భారీ బహిరంగ సభ

వరంగల్ లో ఈ27న బీజేపీ భారీ బహిరంగ సభ

ఈ నెల 27వ తేదీన వరంగల్ లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత పాదయాత్ర ఈనెల 27వ తేదీతో ముగియనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్ టౌన్ లో భారీ బహిరంగ సభకు బీజేపీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ సభ కోసం ఆయా జిల్లాల బూత్ కమిటీల అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరంగల్ సభకు ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఇవాళ్టి నుంచే జన సమీకరణపై దృష్టిపెట్టారు. వరంగల్ లో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరుకానున్నారు. దీంతో భారీ జన సమీకరణకు బీజేపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు. 

ఆగస్ట్ 2వ తేదీ నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నుంచి మూడో విడత పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. మూడో విడత పాదయాత్ర సభకు ముఖ్య అతిథిగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ హాజరైన సంగతి తెలిసిందే. 5 జిల్లాలు, 12 నియోజకవర్గాల మీదుగా 24 రోజుల పాటు 328 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీతో బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది.