ఇంటింటికీ మోదీ దూతలు

ఇంటింటికీ మోదీ దూతలు
  •    45.54 లక్షల మందినికలవాలన్న లక్ష్యంతో ముందుకు
  •     ప్రతిఒక్కరూ 20 ఇండ్లకువెళ్లేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     వెళ్లిన ప్రతీ ఇంటికి స్టిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఓటరుకు మోదీ లెటర్​

యాదాద్రి, వెలుగు : పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ సరికొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిని గుర్తించి వారిని ప్రత్యక్షంగా కలిసేందుకు పలువురు కార్యకర్తలను ‘మోదీ దూతలు’గా ఎంపిక చేసింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2.27 లక్షల మంది కార్యకర్తలను ఎంపిక చేసిన హైకమాండ్, ఎన్నికల్లోపు 45.54 లక్షల మంది లబ్ధిదారులను ప్రత్యక్షంగా కలవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క మోదీ దూత 20 ఇండ్లకు వెళ్లి, మోదీ తరఫున ఒక లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పదేండ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు మోదీ సందేశం ఉంటాయని పార్టీ నేతలు అంటున్నారు. వెళ్లిన ప్రతి ఇంటికీ ఓ స్టిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటిస్తామని చెప్తున్నారు. 

45,54,467 మంది లబ్ధిదారులే లక్ష్యంగా..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశమంతా వివిధ స్కీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమలు చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలో అమలైన స్కీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా లక్షల మంది లబ్ధి పొందారని బీజేపీ నేతలు అంటున్నారు. రేపోమాపో లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలు షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల కానుంది. వచ్చే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో తమ ప్రభుత్వం అమలుచేసిన స్కీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగా లబ్ది పొందిన వారి డేటాను బీజేపీ సేకరించింది. రాష్ట్రంలో 33 జిల్లాల్లోని 17 లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గాల్లో 119 అసెంబ్లీ స్థానాల్లో 3,30,21,735 మంది ఓటర్లు ఉన్నారు. కేంద్రం అమలు చేసిన ఉజ్వల గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇండ్లు, కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమ్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధి, వీధి వ్యాపారుల లోన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు టాయిలెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా నిర్మించింది. ఇవే కాకుండా అమలు చేసిన మరికొన్ని స్కీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల రాష్ట్రంలోని 45,54,467 కుటుంబాలు లబ్ధి పొందాయని బీజేపీ చెబుతోంది.

2,27,723 మంది ముఖ్య కార్యకర్తలు

కేంద్రం అమలుచేసిన స్కీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగా లబ్ధి పొందిన కుటుంబాల నుంచి ఓట్లు రాబట్టేందుకు బీజేపీ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపొందించింది. రాష్ట్రంలో మొత్తం 35,356 బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. స్కీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగా లబ్ధి పొందిన వారి డేటాను బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారీగా విభిజించి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జులకు ఇటీవలే అందించింది. బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వారీగా ఒక్కో ముఖ్య కార్యకర్త 20 కుటుంబాలను ప్రత్యక్షంగా కలవాల్సి ఉంటుంది. ఈ విధంగా రాష్ట్రంలోని 45,54,467 కుటుంబాలను కలిసేందుకు 2,27,723 మంది కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నారు. 

ప్రతి ఇంటికీ మోదీ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మోదీ దూతలు లబ్ధిదారులను కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కలిగిన లాభాలను తెలుసుకొని వీడియో తీసుకుంటారు. అనంతరం మోదీ పేరుతో ‘లబ్ధిదారుల సమృద్ధి- మోదీ గ్యారంటీ’ ఉన్న లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లబ్ధిదారులకు అందిస్తారు. అలాగే లబ్ధిదారుల ఇంటికి మోదీ ఫొటో స్టిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అతికిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుడు మాట్లాడిన వీడియోను బీజేపీకి చెందిన ‘సరళ్’ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు.

ప్రతిబూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 370 ఓట్లు టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దేశంలో 370 ఎంపీ సీట్లను బీజేపీ సొంతంగా సాధిస్తుందని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. లబ్ధిదారులైన ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకొని వారిని పార్టీ వైపు మొగ్గు చూపేలా చేయాలని బీజేపీ ప్రయత్నం. ఇందులో భాగంగానే ప్రతి బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 370 ఓట్లు సాధించాలన్న లక్ష్యంతో మోదీ దూతలను లబ్ధిదారుల ఇండ్లకు పంపుతున్నామని బీజేపీ లీడర్లు చెబుతున్నారు.