నిజామాబాదు జిల్లాలో కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానని బీజేపీ లీడర్ మోసం...జిల్లా ప్రెసిడెంట్కు మహిళ ఫిర్యాదు

నిజామాబాదు జిల్లాలో కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానని బీజేపీ లీడర్ మోసం...జిల్లా ప్రెసిడెంట్కు మహిళ ఫిర్యాదు

నిజామాబాద్​, వెలుగు: ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 49వ డివిజన్ నుంచి బీజేపీ టికెట్ ఇప్పిస్తానని రూ. లక్ష తీసుకున్న నాయకుడిపై చర్యలు తీసుకోవాలని మిర్యాల్కర్ గీత బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్​కు  ఫిర్యాదు చేశారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి  ఫిర్యాదు అందజేశారు. తనకు టికెట్ ఇప్పిస్తానని బీజేపీ నాయకుడు బూసపు శంకర్ రూ. లక్ష తీసుకున్నాడని తెలిపారు. 

టికెట్ వచ్చినట్లేనని నమ్మించి ఫ్లెక్సీలు, నమూనా బ్యాలెట్ పేపర్లు, వాల్ పోస్టర్ల కోసం మరికొంత డబ్బు తీసుకున్నాడన్నారు. టికెట్ వస్తుందని భావించి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ బీ-ఫారం రాలేదని తెలిపారు. డబ్బు తిరిగి ఇవ్వమని కోరగా బెదిరిస్తున్నాడని పేర్కొంటూ, తన డబ్బు వాపస్ చేయించి అతనిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.