మే 20న  కాళేశ్వరంలో పురుషోత్తం రూపాలతో జి.వివేక్ వెంకటస్వామి పర్యటన

మే 20న  కాళేశ్వరంలో పురుషోత్తం రూపాలతో జి.వివేక్ వెంకటస్వామి పర్యటన

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలతో కలిసి రామగుండం, మంథని, కాళేశ్వరంలో పర్యటించనున్నారు. రాత్రి11 గంటలకు NTPC గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు. మే 21న ఉదయం 7:30 నిమిషాలకు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని మిట్టపల్లి సతీష్ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. అనంతరం బూత్ కమిటీ మీటింగ్ లో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల పాల్గొంటారు. 

ఉదయం 10 : 30 నిమిషాలకు గోదావరిఖని రెడ్డి ఫంక్షన్ హాల్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 : 30 నిమిషాలకు గోదావరిఖనిలో దళిత మహిళా నాయకురాలు చిలక భారతి ఇంట్లో లంచ్ చేయనున్నారు. అనంతరం మంథని  నియోజకవర్గంలోనూ పర్యటించనున్నారు.