తెలంగాణ సిన్మా అభివృద్ధి అంటే భూమిలు తీసుకోవడమేనా?…

తెలంగాణ సిన్మా అభివృద్ధి అంటే భూమిలు తీసుకోవడమేనా?…

హైదరాబాద్ : శంకర్ మాటలు సినిమా స్క్రిప్ట్ కే పనిచేస్తాయన్నారు సీనీ నటుడు సీవీల్ నర్సింహారావు. సోమవారం కేసీఆర్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్, సినీ దర్శకుడు శంకర్‌పై తీవ్ర విమర్శలు చేశారు సీనీనటి కవిత, సినీనటుడు సీవీఎల్ నరసింహారావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. శంకర్ మాటలు సినిమా స్క్రిప్టుకే పనికి వస్తాయని, అభివృద్ధి అంటే మోఖిలాలో 50 ఎకరాలు తీసుకోవడమేనా? అని నరసింహారావు ప్రశ్నించారు.

హిందువులకు అండగా ఉంటామన్నందుకు ఇంత రచ్చ చేస్తారా? అరాచకాలు.. అల్లకల్లోలం చేస్తున్నారు అంటారా? అని ప్రశ్నించారు. అంతేగాక, హిందువులను చంపేస్తా.. ఆవులను చంపేస్తా అంటే అప్పుడు మాట్లాడలనిపించలేదా? అని నరసింహారావు నిలదీశారు. భాగ్యలక్ష్మి ఆలయానికి ఎవరూ వెళ్లొదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ సినిమాను చంపేశారు: నర సినిమా అభివృద్ధికి ఫిలిం డెవలప్‌మెంట్ అభివృద్ధి లేదని, ప్రభుత్వం తరపున తెలంగాణ డైరెక్టర్లకు సాయం లేదని అన్నారు. చిత్రపురిలో అర్హులకు ఎందుకు ఇళ్లు ఇప్పించడం లేదని ప్రశ్నించారు. సినిమా వాళ్లు కానీ, వాళ్లను ఎందుకు పంపించడం లేదన్నారు. సినీ అవార్డులు ఇస్తున్నారా? సినిమా రంగంలో తెలంగాణ నుంచి ప్రతినిధులు ఉన్నారా? అని నరసింహారావు నిలదీశారు. సినీ రంగాన్ని అభివృద్ధి చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలని, తెలంగాణ సినిమాను చంపేశారన్నారు.