బీఆర్ఎస్​ నాయకులను తరిమేస్తున్రు : నాగురావు నామాజీ

బీఆర్ఎస్​ నాయకులను తరిమేస్తున్రు : నాగురావు నామాజీ

మరికల్, వెలుగు: ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న బీఆర్ఎస్​ నాయకులను ఊరూరా తరిమేస్తున్నారని బీజేపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో పార్టీ సీనియర్​ నాయకుడు నర్సన్​గౌడ్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు​జిల్లాలో ప్రాజెక్టులు కట్టి ప్రతి ఎకరాకు సాగునీటిని ఇచ్చామని కేసీఆర్​ చెబుతున్న మాటలు అబద్ధమన్నారు. 

నారాయణపేట ఎమ్మెల్యే అనుచరులు రాజకీయాల పేరుతో కబ్జాలు, ఇసుక దందాలు చేస్తూ కమీషన్లకు తీసుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా ఎమ్మెల్యేలు ఒక్క డబుల్​ బెడ్రూం ఇల్లు నిర్మించారా? అని ప్రశ్నించారు. బి.భాస్కర్​రెడ్డి, తిరుపతిరెడ్డి, వేణు, వెంకటేశ్, రమేశ్​​పాల్గొన్నారు.

Also Read:- కాంగ్రెస్​ చెప్పిందే చేస్తుంది : భట్టి విక్రమార్క