యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్

యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్
  •     బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్

​మంచిర్యాల, వెలుగు: ఎంసీసీ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న 53 మంది కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కంపెనీ ముందు కార్మికులు చేస్తున్న దీక్షకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ మద్దతు తెలిపి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంపెనీ యాజమాన్యం తక్షణమే స్పందించి ప్రతి కార్మికుడికి రూ.50 లక్షల నష్ట పరిహారం, రెండు గుంటల భూమి అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

30 సంవత్సరాలుగా కార్మికులు ఈ కంపెనీపై పనిచేస్తున్నారని, కంపెనీ మూతపడటంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కార్యక్రమంలో రవీందర్ రావు, సతీశ్ రావు, ఎ.శ్రీనివాస్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జనాభా ప్రకారం వార్డుల్లో రిజర్వేషన్లు కేటాయించాలి 

నస్పూర్,​ వెలుగు: మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఉన్న జనాభా,  కులగణన ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర  ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​ కోరారు. గురువారం కలెక్టర్ కుమార్​ దీపక్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు.

 తెలంగాణ పురపాలిక చట్టం 2019 ప్రకారం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. నాయకులు సత్రం రమేశ్, కుర్రె చక్రవర్తి, మోతే సుజాత, బియ్యాల సతీశ్ రావు, బోయిని దేవేందర్, సమ్రాజ్ రమేశ్, మద్ది సుమన్ తదితరులు పాల్గొన్నారు.