బీజేపీకి 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం : రవిశంకర్ ప్రసాద్

బీజేపీకి 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం : రవిశంకర్ ప్రసాద్

2023లో జరగనున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకమని ఆ పార్టీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నామని వివరించారు. బలహీనంగా ఉన్న పోలింగ్ బూత్‌‌లను గుర్తించి.. బీజేపీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే 72వేల బూత్‌లను గుర్తించామని తెలిపారు.

బీజేపీకి చారిత్రాత్మక విజయం అందించిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపైనా చర్చించామని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ విషయంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సాంప్రదాయాన్ని ఈసారి మార్చాలని అనుకున్నా.. కుదరలేదన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించిన అంశాలను రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.