కమీషన్ల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తూ అప్పుల రాష్ట్రంగా మార్చారు

కమీషన్ల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తూ అప్పుల రాష్ట్రంగా మార్చారు

సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. కమీషన్ల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తూ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. శుక్ర‌వారం పెద్ధపల్లి జిల్లా, గోదావరిఖని బీజేపీ పార్టీ కార్యాల‌యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులుగా సోమారపు సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వివేక్ వెంక‌ట‌స్వామి… జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాల‌ని చెప్పారు. గోదావరి జలాలను కేసీఆర్ త‌న‌ ఫామ్ హౌస్ కు తరలించుకపోతున్నారని చెప్పారు. తుగ్లక్ పాలన చేస్తున్న కేసీఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతార‌న్నారు.

జిల్లా అధ్యక్షులు సోమారపు.సత్యనారాయణ మాట్లాడుతూ… కృష్ణా బేసిన్ నీటిని రాయలసిమకు తరలించేందుకు కేసిఆర్ కుట్ర చేస్తున్నాడ‌న్నారు. రామగుండానికి నీళ్ళు ఇవ్వకుండా గోదావ‌రి జ‌లాల‌ను కొండ పోచమ్మకు తరలిస్తున్నాడని అన్నారు. రామగుండం బి థర్మల్ స్టేషన్ ను వెంటనే విస్తరించాల‌ని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నియంతృత్వ దొరణికి వ్యతిరేఖంగా అన్నీ పార్టీలను ఏకం చేస్తామ‌ని చెప్పారు. కేంద్రం ప్రభుత్వం సహకారంతోనే ఆర్ ఎఫ్ సి యల్ త్వరలో పున ప్రారంభం కానుంద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణ రెడ్డి, కాసిపేట లింగయ్య, రాష్ట్ర నాయకురాలు బల్మురి వనిత..త‌దిత‌రులు పాల్గొన్నారు.