విజయశాంతి డైనమిక్ లీడర్ : వివేక్ వెంకటస్వామి

విజయశాంతి డైనమిక్ లీడర్ : వివేక్ వెంకటస్వామి

విజయశాంతి డైనమిక్ లీడర్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి కొనియాడారు. ఆమె మాట ఇస్తే తప్పే మనిషి కాదన్నారు. పార్లమెంట్లో తెలంగాణ  కోసం తమతో  కలిసి విజయశాంతి పోరాడిందని గుర్తుచేసుకున్నారు.  బీజేపీ బలోపేతం కృషి చేస్తోన్న విజయశాంతి రాజకీయాల్లో  మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన అకాక్షించారు. రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ పార్టీ కార్యాలయంలో విజయశాంతిని పార్టీ నేతలు సన్మానించారు.  ఈ కార్యక్రమంలో పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

1998 జనవరి 26న రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి మొదట్లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో బీజేపీ నుంచి తప్పుకుని 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు తన పార్టీని టీఆర్ఎస్ లో కలిపేశారు. 2009 ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి, గెలిచి ఎంపీ అయ్యారు. కొన్ని ప్రతికూల పరిణామాలతో ఆమె టీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. 2014లో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి... అక్కడా ఇమడలేకపోయారు. 2020లో విజయశాంతి మళ్లీ బీజేపీ గూటికే చేరారు.