బండి సంజయ్కి ఫోన్ చేసిన వివేక్ వెంకటస్వామి

బండి సంజయ్కి ఫోన్ చేసిన వివేక్ వెంకటస్వామి

కామారెడ్డిలో బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి స్పందించారు. ఈ మేరకు ఆయన బండి సంజయ్ కి ఫోన్ చేసి మాట్లాడారు. కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర జరిగిన ధర్నా గురించి, పోలీసులు అరెస్టు తీరుపై ఆరా తీశారు. బండి సంజయ్ అరెస్టును వివేక్ వెంకటస్వామి తీవ్రంగా ఖండించారు. మరోవైపు బండి సంజయ్ అరెస్టు అయిన విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జ్ తరుణ్ ఛుగ్ ఆయనకు ఫోన్ చేసిన మాట్లాడారు.

ఇవాళ కలెక్టరేట్‭లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన బండి సంజయ్‭, బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్‭ను స్టేషన్‭కు తరలించేందుకు పోలీస్ వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. పోలీస్ వాహనంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో బీజేపీ కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్, రైతు ఆత్మహత్యకు వ్యతిరేకంగా బీజేపీ ధర్నా నిర్వహించింది. మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.