కేసీఆర్ పాలనలో నెంబర్ వన్ అవినీతి రాష్ట్రంగా తెలంగాణ

కేసీఆర్ పాలనలో నెంబర్ వన్ అవినీతి రాష్ట్రంగా తెలంగాణ

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జాతీయ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. ఉద్యమ సమయంలో చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. స్వరాష్ట్రం సిద్ధించిన ఎనిమిదేండ్లలో కేవంల కల్వకుంట్ల కుటుంబం మాత్రమే లబ్ది పొందిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల్ని పక్కనబెట్టి వ్యతిరేకంగా పనిచేసిన ద్రోహులకు కేబినెట్లో  స్థానం కల్పించారని వెంకటస్వామి మండిపడ్డారు. 

రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం బంధీగా మారిందని వివేక్ విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 50 ఎకరాల్లో సీఎంకు ఫాంహౌస్ ఉండేదని, ఇప్పుడు ఆయన కుటుంబానికి 500 ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపించారు. స్వరాష్ట్రం సాధన తర్వాత కూడా చాలా మంది విద్యార్థులు నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అవినీతి రాష్ట్రం మారిందని వివేక్ వ్యాఖ్యనించారు. కర్నాటకలో 18 లక్షలు, యూపీలో 50 లక్షల ఇళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింది నిర్మిస్తుండగా.. మన రాష్ట్రంలో మాత్రం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టలేదని వివేక్ మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చిన కేసీఆర్.. కమీషన్ల కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చాడని.. లిక్కర్ ఆదాయాన్ని 10వేల కోట్ల నుంచి 38 వేల కోట్లకు తీసుకెళ్లాడని వివేక్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర ప్రజల ఆలోచనలను పక్కదోవ పట్టించేందుకు కేసీఆర్ దేశమంతా విమర్శించారు.

పత్రికా ప్రకటనల కోసం రూ.500 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోవడం లేదని వివేక్ ఆవేదన వ్యక్తంచేశారు. రూ.400 కోట్ల వ్యయంతో ప్రారంభించిన కొత్తగా సెక్రటేరియట్ ప్రాజెక్టు ఇప్పుడు రూ.1200 కోట్లకు పెంచాడని అన్నారు. తుగ్లక్ నిర్ణయాలతో వాస్తు నమ్మకంతో పాత సెక్రటేరియట్ను కూల్చివేశారని చెప్పారు. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు కూడా ఉపయోగంలోకి రాలేదని అన్నారు. అయినా కాళేశ్వరంతో 40 లక్షల ఎకరాలకు లబ్ధి చేకూరుతోందని పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు.  కాళేశ్వరం వల్ల కేవలం కేసీఆర్ ఫాంహౌస్ కు మాత్రమే లాభం చేకూరుతోందని వివేక్ ఆరోపించారు.