జేపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి మద్దతు

జేపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి మద్దతు

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి జిల్లా కాటారం ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద సమ్మె చేస్తున్న జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంచాయతీ కార్యదర్శులకు బుధవారం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక వెంకటస్వామి మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఎన్నో ఆశలతో ఉద్యోగాలు తెచ్చుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకుండా వేధిస్తున్నారన్నారు. జేపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల డిమాండ్లు పరిష్కరించేంత వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. అనంతరం కాటారం మండలం సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో నెలకొన్న నీటి సమస్యను ప్రజలు వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లగా ఆఫీసర్లతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాటారం, మహదేవపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బేగ్లూరులో జరిగిన పలు ఫంక్షన్లకు హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో మంథని నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మండల అధ్యక్షుడు భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, శ్రీమన్నారాయణ, ఎంపీటీసీ విజయ పాల్గొన్నారు. 

పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

మల్హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం తాడిచర్లలో నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో బుధవారం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి, రాష్ట్ర నాయకుడు చందుపట్ల సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. తర్వాత పలువురు బీజేపీలో చేరారు. వారి వెంట చిలువేరి సతీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెద్దపల్లి పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐటీ సెల్ కన్వినర్ బీమరాపు సంపత్, మండల ఉపాధ్యక్షుడు రాగం సతీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు గంగాధరి సమ్మయ్య, బూత్ అధ్యక్షుడు వేముల సంపత్, అంగజాల సంజీవ్, మైనార్టీ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండల అధ్యక్షుడు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే నిషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాషా పాల్గొన్నారు.