అద్వానీకి 96 ఏళ్లు.. శుభాకాంక్షలు చెప్పిన మోదీ అండ్ టీం

అద్వానీకి 96 ఏళ్లు.. శుభాకాంక్షలు చెప్పిన మోదీ అండ్ టీం

లాల్ కృష్ణ అద్వానీ నేటితో 96వ ఏట అడుగు పెట్టారు. రాజకీయాల్లో ఒక ట్రెండ్ ను సెట్ చేసిన అద్వానీ నేడు పాలిటిక్స్ కు దూరమైనా ప్రతి బీజేపీ కార్యకర్తకూ ఆయనొక మార్గదర్శి. బుధవారం (నవంబర్ 8న ) అద్వానీ 96వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అద్వానీకి ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అద్వానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ దార్శనిక నాయకత్వం జాతీయ ప్రగతిని, ఐక్యతను పెంపొందించింది అంటూ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా మోదీ చెప్పారు. అద్వానీకి మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. దేశ నిర్మాణం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు 140 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ట్విట్టర్ లో చెప్పారు. 

మరోవైపు.. అద్వానీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.