రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ నాయకలు ధర్నాకు దిగారు. పథకాల పేరుతో రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్, దళితబంధు, బీసీ బంధు వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేశారని.. దీన్ని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని ఆరోపించారు.
కేసీఆర్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.