మూడు రోజులు దాటినా నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రామాయంపేటలో ఆత్మహత్య చేసుకున్న గంగం సంతోష్ కుటుంబాన్ని ఈటెల రాజేందర్, రఘునందన్ రావుతో కలిసి పరామర్శించారు వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మృతుడు ఏమి తప్పు చేయలేదని..అతను వెంచర్లు వేసుకుంటూ ఫ్యామిలీతో ఉండేవాడన్నారు. వెంచర్లలో 50%షేర్ కావాలని అడగడం సిగ్గుచేటన్నారు. తప్పు చేసిన వారిని టీఆర్ఎస్ నాయకులు ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇమిడియేట్ గా నింధితులను అరెస్ట్ చేయాలని.. లేదంటే సిబిఐ ఎంక్వయిరీ వేయిస్తామన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే చొరవ తీసుకుని అరెస్టు చేయాలన్నారు. ఇవన్నీ టిఆర్ఎస్, కేసీఆర్ హత్యలేనన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. పార్టీలు మారని వారిపై పోలీసులతో పీడీ యాక్ట్ కేసులు పెట్టి చిత్ర హింసలు పెడుతున్నారన్నారు.
మరిన్ని వార్తల కోసం:
