
తెలంగాణ కోసం కేసీఆర్ కంటే ఎక్కువ పోరాటం చేశానన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశ చరిత్రలో అసాధారణ ఎన్నికన్నారు. రూ.600 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఉప ఎన్నికలో ఓట్లను కొనడం.. ఒట్టు పెట్టించుకోవడం.. కేసీఆర్ చేసిన నీచమైన పని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రజలను పోలీసులతో బెదిరించారన్నారు. సొంత పార్టీ నాయకులను కొన్న చరిత్ర టీఆర్ఎస్ దన్నారు. కేసీఆర్ ప్రకటించిన పథకాలు కేంద్రపథకాలని ప్రజలకు చెప్పని కేసీఆర్.. కేంద్రం వడ్లు కొనడం లేదని ఇప్పుడు ఎందుకు చెబుతున్నారన్నారు. ఎన్నో వేధింపులకు గురి చేసినా.. ఎన్నో పథకాలు ఇచ్చినా ప్రజలు ధర్మం, న్యాయం వైపే ఉన్నారన్నారు.