- బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శ
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో జరిగిన పేలుళ్ల ఘటన అత్యంత దారుణమని, ఈ ఘటనపై తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.
ఈ ఘటనకు హైదరాబాద్‌తో లింకులు ఉండడం బాధాకరమని, హైదరాబాద్ ఉగ్రమూకలకు అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు. మంగళవారం సాగర్ సొసైటీలో మీడియాతో ఆయన మాట్లాడారు. పాతబస్తీని పాలించేందుకు ప్రత్యేకమైన నిబంధనలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.
పాకిస్తానీలు మాట్లాడినట్లుగా కొన్ని రాజకీయ పార్టీల నేతలు మాట్లాడుతున్నారని, రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు.
