
టీఆర్ఎస్ పాలన ప్రజాస్వామ్య బద్దంగా లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రశ్నించే గొంతుకలను అణచివేయలని చూడటం బాధాకరమన్నారు. ఖమ్మం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన రఘునందన్.. హైద్రాబాద్ మానవహక్కుల కమిషన్ కు వచ్చిన అడ్వకేట్ ను మఫ్టీలో పోలీసులు తీసుకెళ్లడం దుర్మార్గమన్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్. వి.రమణ పోలీస్ తీరులపై అసహనం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకులపై ఎస్సి, ఎస్టీ కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు.ఖమ్మంలో మైనర్ బాలికపై ప్రజాప్రతినిధి అత్యాచారం చేస్తే పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం హేయమైన చర్య అన్నారు. బిసి కమిషన్ ను కూడా పక్కదారి పట్టించారన్నారు. మంత్రుల భూములు ఎలా రెగ్యులైజ్ చేస్తున్నారని ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు గిరిజనులకు నివాళులర్పించని కాంగ్రెస్ ఇప్పుడు.. ఇంద్రవెళ్ళికి వెళ్లి ఇంద్రవెళ్ళికి వెళ్లి మసలికన్నీరు పెట్టడం బాధాకరమన్నారు. గిరిజనులను అక్రమంగా కాల్చిన కాంగ్రెస్ ఇంద్రవెల్లి వెళ్ళి సభపెట్టడమేంటన్నారు.