పాలిటిక్స్ కంటే సినిమాలే ఈజీ: ఎంపీ కంగనా రనౌత్‌‌‌‌

పాలిటిక్స్ కంటే సినిమాలే ఈజీ: ఎంపీ కంగనా రనౌత్‌‌‌‌

న్యూఢిల్లీ:  రాజకీయాల్లో పని చేయడం కంటే సినిమాల్లో నటించడమే ఈజీ అని బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్‌‌‌‌ అన్నారు. రాజకీయాల్లోకి రావాలని చాలా ఏండ్ల క్రితమే తనకు ఆఫర్లు వచ్చాయన్నారు. ‘హిమాచలి పోడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ.. ‘‘మా ముత్తాత సర్జూ సింగ్‌‌‌‌ రనౌత్‌‌‌‌ ఎమ్మెల్యే. అందుకే మా కుటుంబానికి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆఫర్లు వస్తూ ఉంటాయి. నా తొలి చిత్రం గ్యాంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఆఫర్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. 

నా తండ్రి, నా సిస్టర్‌‌‌‌‌‌‌‌కు కూడా కొన్నేండ్లుగా ఇలాంటి ఆఫర్లు వచ్చాయి. రాజకీయాల్లోకి రావాలని నాకు ఆఫర్లు రావడం ఇదే మొదటిసారి కాదు. రాజకీయాలపై నాకు ఇష్టం లేకపోతే నేను అందులోకి వెళ్లాల్సిన అవసరం లేదు” అని ఆమె పేర్కొంది. “ఇది కఠినమైన జీవితం, సినిమాలా కాదు. సినిమా సెట్స్ లో మేం రిలాక్స్డ్ గా ఉంటాం. సాఫ్ట్‌‌‌‌ లైఫ్‌‌‌‌ గడుపుతాం. అందుకే, రాజకీయాల్లో కుదురుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అయితే, నా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌‌‌‌ నుంచి నేను ఇన్‌‌‌‌స్పైర్‌‌‌‌‌‌‌‌ అయ్యాక ఈ మార్గంలోకి వచ్చాను”అని ఆమె తెలిపారు.