టీఆర్ఎస్‌‌లో ఉద్యమకారులు ఉండబోరు.. అంతా బీజేపీలోకి

టీఆర్ఎస్‌‌లో ఉద్యమకారులు ఉండబోరు.. అంతా బీజేపీలోకి

హైదరాబాద్: బీజేపీలో పండుగ వాతావరణం కనిపిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉద్యమకారుడు ఈటల బీజేపీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈటలను తాను దగ్గర్నుంచి చూశానన్నారు. ఉద్యమ సమయంతోపాటు ఇప్పుడు కూడా ఉద్యమకారులకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఈటల ఆదుకున్నారని ప్రశంసించారు. 

‘ఉద్యమంలో ఈటల రాజేందర్‌ది కీలక పాత్ర. అలాంటి వ్యక్తికి టీఆర్ఎస్‌‌లో ఎలాంటి అవమానం జరిగిందో మనందరికీ తెలిసిందే. టీఆర్ఎస్‌లో ఇకపై ఉద్యమకారులెవరూ ఉండబోరు. మాజీ ఎంపీ వివేక్, స్వామి గౌడ్, ఈటల రాజేందర్ వంటి చాలా మంది ఉద్యమకారులు బీజేపీలో చేరారు. ఇంకా మిగిలిన ఉద్యమకారులు అందరూ భవిష్యత్‌‌లో బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ లేకుండా తెలంగాణ వచ్చేదా? తెలంగాణ బిల్లుకు పార్లమెంట్‌లో బీజేపీ మద్దతు పలికింది. ఈటెల రాజేందర్ బీజేపీలో జాయిన్ అవ్వగానే కేసీఆర్‌‌కు భయం పట్టుకుంది. ఇన్నాళ్లూ బయట తిరగని దొర ఇప్పుడు బయటకు వచ్చాడు. ఇక కేసీఆర్ గడీలు బద్దలు కొట్టడమే మిగిలింది. నిజమైన ఉద్యమకారులు ఎవరో.. టీఆర్ఎస్‌లో ఉన్న ఉద్యమకారులు, మంత్రులు ఎవరో ప్రజలు చూస్తున్నారు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.