సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదు

సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదు

మంచిర్యాల: సీఎం కేసీఆర్ సింగరేణిని సర్వనాశనం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. సోమవారం మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే6 గనిపై  నిర్వహించిన బీఎమ్ఎస్ కార్మిక చైతన్య యాత్ర మీటింగ్ లో వివేక్ వెంకస్వామి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. బొగ్గు ఉత్పత్తి పెరిగితే కార్మికుల సంఖ్య కూడా పెరగాలని, కానీ కార్మికులు సంఖ్య ఎందుకు తగ్గుతోందని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. 

మరిన్ని వార్తల కోసం...

కర్ణాటకలోని హుబ్బళ్లిలో 144 సెక్షన్

చైనాపై కోవిడ్ పంజా