రాజ్యసభ సభాపక్ష నేతగా నడ్డా

రాజ్యసభ సభాపక్ష నేతగా నడ్డా

న్యూఢిల్లీ: రాజ్యసభ సభాపక్ష నేతగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆ పార్టీ ప్రకటించింది. ఇంతకుముందు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సభలో ఈ బాధ్యత నిర్వహించారు. అయితే, ఆయన నార్త్ ముంబై లోక్‌‌‌‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. దీంతో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం పార్లమెంట్​లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో.. ఈ బాధ్యతను జేపీ నడ్డాకు బీజేపీ హైకమాండ్ అప్పగించాలని నిర్ణయించింది. మోదీ మంత్రి వర్గంలో నడ్డాతో పాటు రాజ్యసభ నుంచి 11 మంది సభ్యులు ఉన్నారు. కాగా, కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభాపక్ష నేతగా ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఉన్నారు.