సత్యేందర్ జైన్ ను ఆప్ నుంచి తొలగించండి

సత్యేందర్  జైన్ ను ఆప్ నుంచి తొలగించండి

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు భారతీయ జనతా యువ మోర్చా (BJYM) నిరసన తెలిపారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన  సత్యేందర్ జైన్ ను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.  జైన్ దాదాపు రెండు నెలలు జైలులో ఉన్నారు. అయినప్పటికీ కేజ్రీవాల్ అతనిని ఆప్  ప్రభుత్వంలో మంత్రిగా ఉంచారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో జైన్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.కేవలం వీడియో- రికార్డింగ్ ఆధారంగా అవినీతికి పాల్పడిన మరో మంత్రి విషయంలో చేసిన విధంగా కేజ్రీవాల్ జైన్ ను బర్తరఫ్ చేయాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా అన్నారు. సత్యేందర్  జైన్ అరెస్టు తర్వాత, అతని వద్ద ఉన్న ఎనిమిది శాఖలను జూన్‌లో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు అప్పగించారు. జైన్ అరెస్టుపై ఆప్ ప్రభుత్వం బీజేపీపై విరుచుకుపడింది. ఆరోగ్యం, విద్యతో సహా వివిధ రంగాలలో కేజ్రీవాల్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని కేంద్రంలోని అధికార పార్టీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది.