యువతరం ఆకాంక్షలకు ప్రతిరూపం

యువతరం ఆకాంక్షలకు  ప్రతిరూపం
  • బడ్జెట్​ను ఉద్దేశించి ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తాత్కాలిక బడ్జెట్ అభివృద్ధి చెందుతోన్న భారత్ కు చిహ్నమని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ అన్నారు. నేటి యువతరం ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఈ బడ్జెట్ ను రూపొందించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారంటీగా నిలుస్తుందని చెప్పారు. రైల్వే లో తెలంగాణకు రూ. 5,071 కోట్లు కేటాయించడంపై ప్రధాని, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.