బీజేపీతోనే బీఆర్ఎస్​ రాచరికపు పాలన అంతం

బీజేపీతోనే బీఆర్ఎస్​ రాచరికపు పాలన అంతం

మందమర్రి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, బెల్లంపల్లి వెలుగు: రాష్ట్రం లో బీఆర్ఎస్​ రాచరికపు పాలన అంతం కావాలంటే బీజేపీతోనే సాధ్యమని చెన్నూరు నియోజకవర్గం పాలక్​, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్​మీటింగ్‌లో శనివారం క్యాతనపల్లి మున్సిపాలిటీలో బూత్​ కమిటీ సభ్యులు, శక్తికేంద్రాల ఇన్​ఛార్జులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే శోభ మాట్లాడుతూ సబ్బండవర్గాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందని మండిపడ్డారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రసంగాన్ని లీడర్లు, కేడర్​ ప్రొజెక్టర్ ద్వారా వీక్షించారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, నిర్మల్, ఆదిలాబాద్‌లలో పాలక్‌లు, లీడర్లు, శ్రేణులు వర్చువల్​మీటింగ్‌లో పాల్గొన్నారు.