సీతారాముల కళ్యాణంలో వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు

సీతారాముల కళ్యాణంలో వివేక్  వెంకటస్వామి  ప్రత్యేక పూజలు

రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేవిధంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ జాతీయ కార్యకర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఎనిమిదేండ్ల టిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబమే లబ్డి పొందిందన్నారు. మంచిర్యాల జిల్లాలో శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు. బెల్లంపల్లి సీతారాములు కళ్యాణంలో ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ తరపున అంబేద్కర్ విగ్రహ ఏర్సాటుకు యాబైవేల రూపాయలు అందించారు.
 

జగిత్యాల జిల్లా నంచర్లలో వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి. సీతారాముల శోభయాత్రలో పాల్గొన్నారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని సీతారాములను దర్శించుకున్నారు.