టెండర్లు లేకుండా కాంట్రాక్టులా?

టెండర్లు లేకుండా  కాంట్రాక్టులా?

మోర్తాడ్, వెలుగు: నియోజక వర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ టెండర్లు లేకుండా ఒకే వ్యక్తికి ఎలా ఇస్తారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ప్రశ్నించారు. భీంగల్ మండల కేంద్రంలో మంగళ వారం అయన ప్రెస్ మీట్ నిర్వహించా రు. బాల్కొండ నియోజకవర్గంలో 2015 నుంచి 2021 వరకు జరిగిన అభివృద్ధి పనులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి బంధువైన రమేశ్​ రెడ్డికే ఎందుకు కాంట్రాక్టులు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు.  

తన బంధువులకే కాంట్రాక్టులు వచ్చే విధంగా చేసి అందులో నుంచే కమీషన్లు తీసుకుంటున్నాడని అరోపించారు . అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడమే కాదన్నారు, ఆ రోడ్లు కూడా నాసిరకంగా ఉన్నాయని, వేసిన వారానికే పాడవుతున్నాయని తెలిపారు.  ఈ సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ పాల్గొన్నారు.