
గ్రూప్ సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1600 గ్రూప్-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పదేళ్లుగా గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారణమన్నారు. గ్రూప్-1 పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఐఏఎస్ ఆఫీసర్ పోస్టులకు తీవ్ర కొరత ఏర్పడిందన్నారు. ఒక్కో ఐఏఎస్ అధికారి 3, 4 పోస్టులకు ఇంఛార్జ్ గా కొనసాగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 4 వేల గ్రూప్ -2 పోస్టులు, 2 వేల గ్రూప్ -3 పోస్టులు, 40 వేల గ్రూప్ -4 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. తక్షణమే పోస్టులు భర్తీ చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.