
హైదరాబాద్, వెలుగు: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేస్తు న్నది. ఇందులో భాగంగా ఈ నెల 6న నల్గొండలో చేపట్టనున్న నిరసనను స్టేట్ పార్టీ 11వ తేదీకు వాయిదా వేసింది. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో పార్టీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నల్గొండ టూర్ కు సంబంధించి ఆ జిల్లా బీజేపీ నేత లతో ఆమె మాట్లాడారు. డబుల్ బెడ్రూ మ్ ఇండ్ల కేటాయింపుల్లో భాగంగా జిల్లాలో చేపట్టనున్న నిరసన కార్యక్ర మాల్లో కిషన్‌రెడ్డి పాల్గొననున్నారని తెలిపారు. ఈ నెల 6న కిషన్‌రెడ్డి పర్యటన సాధ్యం కాదని, అందుకే 11వ తేదీకి వాయిదా వేశామన్నారు.